Sunday, December 22, 2024

పిఎస్‌లో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి జైలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పోలీస్ స్టేషన్‌లో న్యూసెన్స్ చేసిన యువకుడికి కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. మీర్‌చౌక్ ఇన్స్‌స్పెక్టర్ ఆనంద్ కథనం ప్రకారం… అర్బాజ్ షరిఫ్(25) అనే వ్యక్తి గత నెల 23వ తేదీన రాత్రి 10 గంటలకు ముస్లిం మెటర్నటీ ఆస్పత్రి వద్ద న్యూసెన్స్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. స్టేషన్‌కు వచ్చిన తార్వాత కూడా అర్బాజ్ పిఎస్‌లో న్యూసెన్స్ చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. అన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడికి మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News