మనతెలంగాణ, హైదరాబాద్ : మహిళలను వేధించిన ఏడుగురికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని హైదరాబాద్ షీటీమ్స్ అదనపు పోలీస్ కమిషనర్ ఎఆర్ శ్రీనివాస్ తెలిపారు. గోల్కొండ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల సందర్భంగా దేవాలయానికి వచ్చిన మహిళల ఫొటోలను వారికి తెలియకుండా తీయడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేసిన వారిని షీటీమ్స్ అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా జైలుశిక్ష, జరిమానా విధించారు. మలక్‌పేటకు చెందిన నాగరాజు, సన్‌సిటీకి చెందిన షేక్ ఆర్జడ్‌అలీ, లంగర్‌హౌస్‌కు చెందిన కిరణ్, ఎం. శ్రీకాంత్, సాయిలు, అబ్దుల్ మహ్మద్, ఖాజా నసీరుద్దిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు పోలీస్ కమిషనర్ ఎఆర్ శ్రీనివాస్ హెచ్చరించారు. అసభ్యంగా ప్రవర్తించడం, ఇబ్బందులు కలిగించడం చేస్తే వదిలేయమని, షీటీమ్స్ నగరంలో మఫ్టీలో తిరుగుతూనే ఉంటారని తెలిపారు.