Thursday, January 23, 2025

నిర్మాత బండ్ల గణేశ్ కు జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

ఏడాది జైలు శిక్ష విధించిన ఒంగోలు మున్సిఫ్ కోర్టు

మన తెలంగాణ/ హైదరాబాద్:   బాకీ విషయంలో చెల్లని చెక్కు ఇచ్చిన కారణంగా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కు ఒంగోలు రెండో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ పి. భాను సాయి జైలు శిక్ష, జరిమానా విధించారు.

జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేశ్ రూ. 95 లక్షలు చెల్లించాల్సి ఉండగా, దానికి సంబంధించిన చెక్ ఇచ్చారు. ఆ చెక్ బ్యాంకులో ఖాతాలో నగదు లేక బౌన్స్ అయింది. దాంతో ఆయన న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన మెజిస్ట్రేట్ రూ. 95 లక్షలను ఫిర్యాదికి పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై అప్పీలు చేసుకోడానికి సైతం కోర్టు నెల రోజుల గడువునిచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News