Monday, December 23, 2024

కిరాణా షాపులో బెదిరించిన వారికి జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉచితంగా సరుకులు ఇవ్వాలని కిరాణా షాపు వారిని బెదిరించిన నలుగురు యువకులకు స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టు పద్దెనిమిది రోజుల జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం ప్రకారం… సనత్‌నగర్‌కు చెందిన రాకీ ఫిలీప్స్, ఎండి మాజా ఖాన్, ఎండి అర్బజ్, ఎండి తైమూర్ కలిసి బెదిరిస్తున్నారు. నలుగురు నిందితులు ఈ నెల 16వ తేదీ రాత్రి సమయంలో ఫుల్‌గా మద్యం తాగి బాపు నగర్‌లోని కూల్ డ్రింక్ షాప్‌కు వెళ్లారు.

అక్కడి కూల్‌డ్రింక్ తాగారు, షాపు యజమాని డబ్బులు అడగడంతో ఇచ్చేందుకు నిరాకరించారు. ఇరువురి మధ్య డబ్బుల కోసం వాగ్వాదం జరగడంతో షాపు యజమానిపై నలుగురు కలిసి దాడి చేశారు. వెంటనే బాధితుడు ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపర్చారు. సాక్షాలను పరిశీలించిన కోర్టు నిందితులకు 18 రోజుల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News