Sunday, December 22, 2024

హైదరాబాద్‌లో భార్యను కొట్టిన వ్యక్తికి జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చిన్న చిన్న విషయాలకే భార్యను వేధించి కొట్టిన కేసులో ఓ వ్యక్తిని స్థానిక కోర్టు 16 రోజుల జైలు శిక్ష విధించింది. హఫీజ్ బాబానగర్‌లో నివాసం ఉంటున్న మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ (26)పై పోలీసులు సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 70బి, 70సి కింద కేసు నమోదు చేశారు. కోర్టు అతనికి 16 రోజుల సాధారణ జైలు శిక్ష విధించి, చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు పంపింది. నిందితుడి భార్య పోలీసులను ఆశ్రయించింది. తనను నిత్యం కొడుతున్నాడని, చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆయనపై ఫిర్యాదు నమోదు చేసింది. కుటుంబాన్ని పోషించడం లేదని, ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆమె వాపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News