Friday, April 25, 2025

సల్మాన్‌ఖాన్‌కు జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ వార్నింగ్

- Advertisement -
- Advertisement -

ముంబై: బిష్ణోయ్ కులానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ప్రస్తుతం జైలులో మగ్గుతున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరించాడు. పంజాబీ గాయకుడు సిధూ మూసేవాలా హత్యలో లారెన్స్ బిష్ణోయ్ ముఠా హస్తముంది.

ఎబిపి చానల్‌కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వూలో లారెన్స్ బిష్ణోయ్ మాట్లాడుతూ బిష్ణోయ్ కులస్తులు కృష్ణ జింకను ఆరాధిస్తారని, దానని చంపడం తమ కులంలో నిషిద్ధమని చెపాక్క కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ నిందితుడని, రాజస్థాన్‌లోని జాంబేశ్వర్‌జీ ఆలయం ముందు సల్మాన్ క్షమాపణ చెప్పాలని బిష్ణాయ్ డిమాండ్ చేశాడు. సల్మాన్ ఖాన్ పట్ల తమ కులంలో చాలా ఆగ్రహం ఉందని, అతడు తమ సమాజాన్ని అవమానించాడని బిష్ణోయ్ చెప్పాడు.

సల్మాన్‌పైన కేసు నమోదైనా అతడు ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదని, అందుకు తగిన పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని బిష్ణోయ్ హెచ్చరించాడు. తాను ఎవరిపైన ఆధారపడనని కూడా అతడు చెప్పాడు. చిన్నప్పటి నుంచి సల్మాన్‌పై తనకు పట్టరాని కోపం ఉందని, త్వరలోనే అతడి అహంభావాన్ని అణచివేస్తానని బిష్ణోయ్ హెచ్చరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News