Wednesday, January 22, 2025

మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా

- Advertisement -
- Advertisement -

సిఎం సిఫార్సుపై గవర్నర్ ఆమోదం

చెన్నై : అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ మంత్రి మండలి నుంచి రాజీనామా చేసినట్లు రాజ్ భవన్ మంగళవారం వెల్లడించింది. ‘సెంథిల్ బాలాజీ రాజీనామాను ఆమోదించాలని సిఫార్సు చేస్తూ’ సోమవారం (12న) ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నుంచి అందిన లేఖ ఆధారంగా గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆ సిఫార్సును ఆమోదించినట్లు రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది.

తమిళనాడు మంత్రి మండలి నుంచి వి సెంథిల్ బాలాజీ రాజీనామాను గవర్నర్ ‘ఆమోదించారు’ అని ఆ ప్రకటన తెలిపింది. ఉద్యోగానికి నగదు కుంభకోణం కేసులో సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) 2023లో అరెస్టు చేసింది. బాలాజీ చెన్నైలోని పుళల్ జైలులో నిర్బంధంలో ఉన్నారు. రాజీనామాకు ముందు ఆయన పోర్ట్‌ఫోలియో లేని మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు ఆయన విద్యుత్, మద్యనిషేధ శాఖలను నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News