Wednesday, January 22, 2025

కర్నాటకలో జైనస్వామి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలో ప్రసిద్ధ జైనముని కామకుమార నంది మహారాజ్ దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని బెల్గావి జిల్లాలోని ఆశ్రమం నుంచి ఈ జైనస్వామి గడిచిన రెండు రోజులుగా కన్పించకుండా పొయ్యారు. తరువాత రెండురోజులకు ఈ దిగంబర జైనస్వామి శరీర భాగాలు చిక్కోడి తాలూకాలో ఓ బోర్‌వెల్‌లో కనుగొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు,ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరులకు తెలిపారు. స్వామిజీ దారుణ హత్యను విహెచ్‌పి తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో నెలకొన్న హిందూ వ్యతిరేక విధానాలే ఈ ఘటనకు దారితీశాయని విహెచ్‌పి ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే ఓ ప్రకటనలో తెలిపారు. హంతకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News