దిగంబర జైనుల వర్గానికి పెద్దదిక్కు
రాయ్‌పూర్ : ప్రముఖ జైన మతపెద్ద ఆచార్య విద్యాసాగర్ మహారాజు ఆదివారం ప్రాయోపవేశం ద్వారాతనవు చాలించారు. ఆయన సల్లేఖన ప్రక్రియలో ఆదివారం కన్నుమూసినట్లు, ఆయన మృతివార్తను చత్తీస్‌గఢ్‌లోని దొంగార్‌ఘర్‌లోని జైన చంద్రగిరి తీర్థ ధర్మకర్తల మండలి తెలిపింది. ఈ స్వామిజి వయస్సు 77 సంవత్సరాలు . ఆధ్యాత్మిక పరిపూర్ణత, మానవాళి సంక్షేమానికి జైన మతాచారం ప్రకారం ఈ సల్లేకన అనే ప్రాయోపవేశ ఘట్టం ఆచరిస్తారు. మతపెద్దలు ఇందులో భాగంగా తమకు తాము మరణించే వరకూ ఉపవాస దీక్షకు పాల్పడుతారు. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం మృతి చెందినట్లు ట్రస్ వర్గాలు నిర్థారించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆయన గౌరవార్థం ఆదివారం సగంరోజు సంతాప దినం పాటించింది. దిగంబర జైన సాధువుల సాంప్రదాయం తంతులో ఆచార విద్యాసాగర్ మహారాజు జీ ప్రముఖులు అని, ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది.