Sunday, December 22, 2024

జైన మఠాధిపతి హత్య..పాడుబడిన బావిలో మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

బెలగావి: కర్నాటకలో ఒక జైన మఠాధిపతి హత్యకు గురయ్యారు. బెలగావి జిల్లాలోని చిక్కోడి తాలూకా హిరేరోడి గ్రామంలోని నంద పర్వత్ మఠాధిపతి కాంకుమార్ నంద్ మహరాజ్ రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహం రాయబాగ్ తాలూకాలోని ఖటక్‌వావి గ్రామంలో ఒక పాడుపడిన బావిలో లభించింది.

జైన పీఠాధిపతి కాంకుమార్ నంద్ మహరాజ్‌ను చివరిసారి ఆయన భక్తులు జులై 5వ తేదీ సాయంత్రం చూశారు. శుక్రవారం ఆయన కనిపించకపోవడంతో గాలించిన భక్తులు చివరకు పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. జైన స్వామి వద్ద డబ్బులు అప్పు తీసుకున్న ఒక వ్యక్తి దాన్ని ఎగ్గొట్టిన విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఆ వ్యక్తే తన మిత్రుడి సాయంతో స్వామీజీని హత్య చేసి శవాన్ని పాడుబడిన బావిలో పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. స్వామీజీ ఆచూకీ కోసం ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లోనే కేసును ఛేదించినట్లు జిల్లా ఎస్‌పి సంజీవ్ పాటిల్ తెలిపారు.

గత కొద్ది రోజులుగా స్వామీజీనే అంటిపెట్టుకుని తిరుగుతున్న అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను, మరో వ్యక్తి కలసి స్వామీజీని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఆయన చెప్పారు. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు ఈ హత్య వెనుక మరెవరి ప్రమేయమైనా ఉందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News