Thursday, January 23, 2025

బైకుపై ప్రేమపక్షుల కౌగిలింతల జోరు….. పోలీసుల బేజారు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: హోలీ వేడుకలను ఎవరైనా రంగులతో చేసుకుంటారు. కాని ఈ ప్రేమపక్షులు బైకులో షికారు చేస్తూ కౌగిలింతలతో చేసిన సందడి సోషల్ మీడియాలో వేరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఈ ప్రేమ జంట జైకుపై చెప్పుకున్న ప్రేమ ముచ్చట్లను ప్రదీప్ షెకావత్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నడుపుతున్న యువకుడిని అతనికి అభిముఖంగా కూర్చున్న యువతి కౌగిలింతలతో ప్రేమ వర్షం కురిపించడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. అయితే..రోడ్డు భద్రతా న్రిబంధనలకు విరుద్ధంగా వీరు ప్రవర్తించడమే చర్చనీయాంశంగా మారింది. రోడ్డుపై ఇదేమి ప్రేమంటూ నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. బైకు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ ప్రేమ జంట ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఏదేమైనా ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని అజ్మీర్ నగరంలో ఒక ప్రేమ జంట బైకులో కూర్చుని ముద్దులతో ముచ్చట్లు చెప్పుకుంటున్న వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News