Friday, December 20, 2024

భర్త లంచావతారం.. జైపూర్ మేయర్ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

జైపూర్ : భర్త లంచాలు పుచ్చుకున్న అభియోగాలతో అరెస్టు కావడంతో మరుసటి రోజు ఆయన భార్య జైపూర్ హెరిటేజ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మునేష్ గుర్జర్‌ను రాజస్థాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అర్థరాత్రి దాటిన తరువాత ఉత్తర్వులు వెలువరించింది.

భూముల లీజు గురించి మేయర్ భర్త సుశీల్ గుర్జర్‌ను రాష్ట్ర ఎసిబి శనివారం అరెస్టు చేసింది. భార్య మేయర్ కావడంతో ఆమె పేరుమీద పనులు చేయిస్తానని భర్త ఈ లంచాలు తీసుకున్నట్లు తేలింది. దీనితో పరిస్థితిని సమీక్షించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆమెను మేయర్ పదవి నుంచి సస్పెండ్ చేసింది. స్థానిక కార్పొరేషన్‌లోని వార్డు నెంబరు 43 కార్పొరేటర్ పదవి నుంచి కూడా తాత్కాలికంగా తీసివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News