Thursday, December 19, 2024

మోడీ ‘వెళ్లిపోతున్న ప్రధాని’ : జైరాం రమేశ్

- Advertisement -
- Advertisement -

ఇంతవరకు జరిగిన పోలింగ్ పరిస్థితుల బట్టి దక్షిణ భారతం నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతోందని స్పష్టమవుతోందని ఇక దేశంలో మిగతా భాగంలో సగానికి సగం బీజేపీ తగ్గిపోతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ బుధవారం అంచనా వేశారు. నరేంద్రమోడీని “మాజీ కానున్న ప్రధాని ” గా సంబోధించారు. రాంచీలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ ఓటర్లను మతం పేరుతో విభజించారని, ఇప్పుడు హిందూ ముస్లిం విభజన రాజకీయాలు తానెప్పుడూ చేయలేదని అబద్ధాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మోడీ వెళ్లిపోతున్న ప్రధానిగా పోలింగ్ మొదటి దశల తరువాత ఆయన నిరాశానిస్పృహలు చెబుతున్నాయని అలాగే అమిత్‌షా కూడా వెళ్లిపోతున్న హోం మంత్రి అని జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు. జూన్ 4 తరువాత ఈ అబద్ధాల మహమ్మారిని దూరం చేస్తామని పేర్కొన్నారు. “

మోడీ కీ గ్యారంటీ ” చదునుగా పడిపోయిందని, వికిసిత్ భారత్ గురించి మాటే లేదని , హిందూముస్లిం చుట్టూ బీజేపీ ప్రచారం సాగుతోందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో తరువాతి ప్రభుత్వాన్ని ఇండియా కూటమి ఏర్పాటు చేస్తుందన్నారు. దేశం మొత్తం మీద కులగణన జరుగుతుందని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి, వెనుకబడిన వర్గాలను సరిగ్గా గుర్తించడానికి కులగణన అవసరమని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సిబిఐ, ఐటి విభాగాలను చాలా చెడుగా దుర్వినియోగం చేసిందని, కాంగ్రెస్ అధికారం లోకి వచ్చేలా ఓటు వేస్తే ఆ విభాగాల అధికారాలను తిరిగి ప్రక్షాళన చేయడమౌతుందన్నారు. భూసేకరణ చట్టాలు బలహీనంగా ఉన్నందున పెట్టుబడిదారులు ప్రయోజనం పొందుతున్నారని ఆరోపించారు. సంపదను తిరిగి పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ఏనాడూ చెప్పలేదని, అందర్నీ కలుపుకుని పంపిణీ చేస్తామని చెప్పిందని వివరించారు. బీజేపీ తన నినాదం “400పార్ ”ను విస్మరించిందని, “ మా 400 పార్ దినసరి వేతనం రూ. 400 గురించి అని, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు కూడా ఇది వర్తిస్తుందన్నారు.

అదానీ అంబానీ లను రాహుల్ గాంధీ దూషించకుండా ఉండడానికి వారి నుంచి కాంగ్రెస్ టెంపోలోడుతో నగదు అందుకుందని ప్రధాని మోడీ ఆరోపణలను ప్రస్తావిస్తూ దీన్ని రుజువు చేయడానికి ఈడీ, సిబిఐలను బీజేపీ ఎందుకు ఉపయోగించడం లేదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News