Sunday, November 17, 2024

మన్‌కీబాత్ కాదు.. మౌన్‌కీ బాత్ తెలియజేయాలి : జైరాం రమేశ్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ప్రతినెలాఖరులో నిర్వహించే మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ ఈ నెల 30 న కానుండడంతో బీజేపీ భారీ స్థాయిలో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. అదానీ, చైనా సరిహద్దుల సమస్యలు, సత్యపాల్ మాలిక్ ఆరోపణలు, ఎంఎస్‌ఎంఇల విధ్వంసం, తదితర అనేక అంశాల పైన “మౌన్‌కీ బాత్ ” (మాట్లాడలేక మౌనం ) నడుస్తోందని వ్యాఖ్యానించారు.

Also Read: ఈ లూటీ ప్రభుత్వాన్ని దించేయండి: ప్రియాంక పిలుపు

మన్‌కీ బాత్ కాకుండా మౌన్‌కీ బాత్ తెలియజేయాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. మన్‌కీ బాత్ 100 వ ఎపిసోడ్‌ను దేశ వ్యాప్తంగా ఆయా నియోజక వర్గాల్లో విజయవంతం చేసే బాధ్యతను కేంద్ర మంత్రులు, ఎంపీలు చూస్తారు. ఆరోజున వివిధ కార్యక్రమాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాల్గొంటారు. రూ.100 నాణేలను కూడా ప్రభుత్వం విడుదల చేస్తోంది. 2014అక్టోబర్ 3న మన్‌కీబాత్ కార్యక్రమం ప్రారంభమైంది. 100 వ ఎపిసోడ్‌ను వివిధ దేశాల్లో ప్రసారం చేసేందుకు బీజేపీ సన్నామాలు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News