Sunday, December 22, 2024

‘క్రిమినల్ ’ కొత్త బిల్లులను వ్యతిరేకిస్తాం : జైరాం రమేశ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలకు బదులుగా భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత( బిఎన్‌ఎస్‌ఎస్) , భారతీయ సాక్ష (బీఎస్) పేర్లతో కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు కొత్త బిల్లులను వ్యతిరేకిస్తున్నట్టు కాంగ్రెస్ తెలిపింది. ఇవి చాలా ప్రమాదకరమని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా సభల్లో లేవనెత్తాల్సిన అంశాలు, వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ నివాసంలో సోమవారం సమావేశమై చర్చించారు.

ఈ సమావేశ వివరాలు జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, విదేశాంగ విధానం , సరిహద్దుల్లో పరిస్థితులపై ఉభయ సభల్లో స్వల్పకాలిక చర్చకు అనుమతించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్టు చెప్పారు. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఆయా వివరాలను విశ్లేషిస్తున్నామని, మరింత బలంగా పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై లోక్‌సభ నైతిక విలువల కమిటీ నివేదికను ప్రస్తావిస్తూ దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News