Thursday, December 19, 2024

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై స్పందించిన జైరాం రమేష్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఏదైతే బాగా చేయగలరో అది మరోసారి చేసి తనను తాను నిరూపించుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎదురుదాడికి దిగారు. ప్రతిపక్ష కూటమి ఇండియా పొగరుబోతులు (గమండియా) కూటమి అని , ఇది ఇండియా కాదు గమండియా అని గురువారం ప్రధాని మోడీ చేసిన విసుర్లపై జైరాం స్పందించారు. ప్రధాని మోడీకి ఇతరులను అవమానించేలా మాట్లాడటం వెన్నతో పెట్టిన విద్య, పైగా గుజరాతీ వెన్నతో అబ్బిన లక్షణం అని దీనిని మరోసారి ఆయన ఇప్పుడు తన మాటలతో నిరూపించుకున్నారని కాంగ్రెస్ నేత తెలిపారు.

ప్రధాని మోడీ గురువారం మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ అదేపనిగా ప్రతిపక్షాల నేతలను అవమానించారని, ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి ఇది తగునా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఇప్పుడు సారధ్యం వహిస్తున్నది ఎన్‌డిఎకు కాదని గౌతమ్ అదానీతో కూడిన కూటమి జిఎ ఎన్‌డిఎకు అని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఆయన జిఎ ఎన్‌డిఎ నేత అని ఎవరైనా తేలిగ్గానే చెప్పగలరని తెలిపారు. ప్రధాని మోడీ దేనిపై అయినా విమర్శలకు దిగవచ్చు. అయితే ఈ విధంగా ప్రధాని అయి ఉండి, ప్రభుత్వ కార్యక్రమంలో ఇతరులను తిట్టిపోయడం భావ్యమా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News