Wednesday, January 22, 2025

ప్రైవేట్ కంపెనీల నుంచి బిజెపి వసూళ్ల దందా: జైరాం రమేష్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీల నుంచి విరాళాలు వసూలు చేయడానికి దర్యాప్తు సంస్థలను బిజెపి ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ప్రభుత్వం హఫ్తా వసూల్(మామూళ్ల వసూళ్లు)పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ డిమాండు చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శుక్రవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2018-19, 2022-23 ఆర్థిక సంవత్సరాలలో బిజెపికి రూ. 335 కోట్ల విరాళాలు అందచేసిన కనీసం 30 కంపెనీలు ఆ కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తును ఎదుర్కొన్నాయని చెప్పారు.

ఇదే విషయాన్ని తెలియచేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసిన కాంగ్రెస్ మరో ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ బిజెపి స్వీకరించిన విరాళాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సైతం బిజెపి విరాళాలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే విరాళాలు ఇవ్వండి, బెయిల్ తీసుకోండి, వ్యాపాం చేసుకోండి అనే పథకం గురించి మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. ఇడి, ఐటి, సిబిఐలను దుర్వినియోగం చేస్తూ మోడీ వసూలీ భాయ్ తరహాలో వ్యాపాం చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News