Wednesday, January 22, 2025

బైడెన్ బృందంపై మోడీ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జి 20 సమ్మిట్‌కు వచ్చిన బైడెన్ కానీ, అమెరికా ప్రతినిధి బృందం కానీ ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహణకు దిగకుండా మోడీ ప్రభుత్వం అడ్డుకుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. జి 20 సమ్మిట్ దశలో తనకు అనుకూల చిత్రీకరణకు ప్రధాని మోడీ, ఆయన ప్రచారక బృందం బాగా కష్టపడిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. ఇప్పుడు వియత్నాంలో విలేకరుల సమావేశం పెట్టి బైడెన్ మోడీకి క్లాసు తీసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందని రమేష్ స్పందించారు.

మానవ హక్కులను ఆదరించండి, సభ్య సమాజ రివాజును పాటించండని మోడీ ముఖం మీదనే బైడెన్ చెప్పారని , పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ అవసరం అని కూడా చురకలు పెట్టారని, ఇప్పుడు ఇదే విషయాన్ని బైడెన్ మొత్తం ప్రపంచానికి తెలిసేలా వియత్నాంలో మీడియా ద్వారా తెలిపారని కాంగ్రెస్ నేత విశ్లేషించారు. ఢిల్లీలో ఉన్నదశలో బైడెన్ పట్ల మోడీ ధోరణి పూర్తిగా కట్టడితో ఉందని అంటూ ప్రెస్ మీట్ పెట్టను, పెట్టనివ్వను అనే ధోరణిలో సాగిందని, అయితే ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత తాను చెప్పదల్చుకున్నది మోడీకి వియత్నాంలో బైడెన్ చెప్పేశారని జైరాం రమేష్ తెలిపారు. కాగా బైడెన్ టీం ఢిల్లీలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా మీడియాతో ముచ్చటించేందుకు అధికార బృందాలు అనుమతించలేదని జైరాం రమేష్ చెప్పారు.

ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చల తరువాత విలేకరులో మాట్లాడేందుకు తమకు భారత అధికారులు అనుమతించలేదని, ఏదోవిధంగా విలేకరులకు దూరంగా ఉంచారని ప్రెసెడెంట్ బైడెన్ టీం ఇప్పుడు చెపుతోందని కాంగ్రెస్ నేత చెప్పారు. ఇక్కడ చెప్పదల్చుకున్న సమాధానాలను వియత్నాంలో బైడెన్ చెప్పుతున్నారని, ఎవరిని ఏది మాట్లాడనివ్వకపోవడం ఇదే మోడీ తరహా ప్రజాస్వామ్యం అని అయితే బైడెన్‌ను ఇతర దేశాలలో కట్టడి చేయడం మోడీకి వీలవుతుందా? అని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News