- Advertisement -
కేంద్ర హోం శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులో వివిధ ఉగ్ర సంఘటనలకు పాల్పడిన నిషిద్ధ సంస్థ జైషే మొహ్మమ్మద్(జెఇఎం) కమాండెంట్ ఆషిఖ్ అహ్మద్ నెంగ్రూను ఉగ్రవాదిగా కేంద్రం సోమవారం ప్రకటించింది. జమ్మూ కశ్మీరులోకి ఉగ్రవాదులను అక్రమంగా తరలించడంలో నెంగ్రూకు సంబంధం ఉందని, ఆ ప్రాంతంలో జరిగిన అనేక ఉగ్ర సంఘటనలకు అతనే బాధ్యుడని కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కశ్మీరులో ఉగ్రవాద సిండికేట్‌ను నెంగ్రూ నిర్వహిస్తున్నాడని, పాకిస్తాన్ నుంచి ఆదేశాలు పొందుతూ జమ్మూ కశ్మీరులో ఉగ్ర సంఘటనలు సృష్టిస్తున్నాడని కేంద్రం తెలిపింది. దేశ భద్రతకు ముప్పుగా మారిన నెంగ్రూను కట్టడి చేసి ఉగ్ర చర్యలను నిరోధించడానికి అతడిని ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోం శాఖ పేర్కొంది.
- Advertisement -