Wednesday, January 22, 2025

దెబ్బతిన్న జవాన్లపై కసితీరా కాల్పులు.. వీడియోను విడుదల చేసిన ఉగ్ర సంస్థ

- Advertisement -
- Advertisement -

పూంచ్: ఒళ్లు గగుర్పాటు కల్గించేలా జరిగిన ఫూంచ్ దాడి ఘటనను తెలిపే ఓ వీడియోను పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న జైష్ ఏ మహమ్మద్ సోమవారం విడుదల చేసింది. గత నెలలో ఫూంచ్‌లో ఉగ్రవాదులు ఓ ఆర్మీశకటాన్ని టార్గెట్ చేసుకుని గ్రనెడ్ దాడికి పాల్పడ్డ ఘటనలో ఐదుగురు జవాన్లు మంటల్లో కాలి చనిపోయారు. ఇప్పుడు విడుదల అయిన వీడియోలో ఉగ్రవాదులు దాడి ప్రాంతంలో ఉండి దారుణానికి పాల్పడటం, జవాన్లు తిరిగికోలుకోకుండా ఉండేందుకు చనిపోయే వరకూ కాల్పులు జరపండనే ఆదేశాల నడుమ భీకర స్థాయిలో వ్యవహరించడం వంటి దృశ్యాలు ఇందులో చోటుచేసుకున్నాయి.

ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న వీడియోను గుర్తించిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇది జైష్ సంస్థ నుంచి వెలువడిందని నిర్థారించుకుంది. భారతీయ జవాన్లు పాక్‌ప్రేరేపిత ఉగ్రవాదులను వీరోచితంగా తిప్పికొట్టేందుకు యత్నించడం, ఈ క్రమంలో దొంగదెబ్బకు బలి కావడం వంటి విషయాలు ఇందులో స్పష్టం అయ్యాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News