Thursday, January 23, 2025

ఉక్రెయిన్ కేంద్రీకృతంగానే జి20 చర్చలు

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్ కేంద్రీకృతంగానే జి 20 చర్చలు
ఏకాభిప్రాయ సాధన అంత ఈజీ కాలేదుః జైశంకర్
మార్కెట్ పురోగామ దేశాల తోడ్పాటు కీలకం
ఏ దేశమూ ఘర్షణలను కోరుకోవడం లేదు
న్యూఢిల్లీ : జి20 ఢిల్లీ డిక్లరేషన్ దశలో ముందుగా ఏకాభిప్రాయ సాధన చాలా క్లిష్టమైన ప్రక్రియ అయిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం విలేకరులకు తెలిపారు. ప్రత్యేకించి ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితి ప్రధాన కేంద్ర బిందువు అయింది. దీనిపై ఏకాభిప్రాయ సాధనకు దిగి డిక్లరేషన్ రూపొందించేందుకు ముందస్తు చర్చలు రోజుల తరబడి సాగాయని వివరించారు. ఉక్రెయిన్ విషయం భౌగోళిక రాజకీయ సంక్లిష్టతకు అద్దం పట్టింది.

దీనిపై ప్రతి దేశం ఏకాభిప్రాయానికి తోడ్పాటు అందించిందని, ఎందుకంటే ఇటువంటి ఘర్షణలు చివరికి సంబంధం ఉన్నా లేకపోయినా వివిధ దేశాలకు చిక్కులు తెచ్చిపెడుతాయని అంతా భావించారని తెలిపారు. పలు దేశాలు ఏకాభిప్రాయ సాధనకు ముందుకు వచ్చాయి. అయితే వృద్థిలోకి వస్తున్న మార్కెట్ల దేశాలు ఇందులో ప్రధాన పాత్ర వహించాయని వివరించారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ మార్కెట్ల విస్తరణకు తలెత్తుతున్న ప్రపంచ స్థాయి ఘర్షణల వాతావరణం తొలిగి తీరాల్సి ఉందని గ్రహించాయని, ఈ దిశలోనే ఉక్రెయిన్ కేంద్ర బిందువుగా ఈ డిక్లరేషన్ వెలువడేందుకు ఈ దేశాల తోడ్పాటు కీలకం అయిందని విదేశాంగ మంత్రి వెల్లడించారు.

పలు విషయాలపై విభిన్న వైఖరులు ఉండటం సహజమేనని అయితే చివరికి నిర్ణీత ఆలోచన దిశలో ల్యాండ్ అయ్యామా లేమా అనేదే కీలకం అని చమత్కరించారు. చర్చల దశలో భారతదేశపు నిజాయితీ పలు దేశాలకు నచ్చింది. వారిని ఆకట్టుకునే రీతిలో జరగబోయే ముప్పు గురించి తెలియచేయడం జరిగింది. ఇదే సమగ్ర సమ్మతి ప్రకటనకు దారితీసిందని వివరించారు. ఇప్పటి సమస్యలకు అనుగుణంగా ఢిల్లీ డిక్లరేషన్‌ను వెలువరించడం జరిగింది. ఉక్రెయిన్ పరిస్థితిపై ఇంతకు ముందటి బాలి డిక్లరేషన్‌లోనూ ప్రస్తావన ఉంది. అయితే అది అప్పటి పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తీవ్రత స్థాయి లేకుండా వెలువరించిన ప్రకటన . కానీ ఇప్పుడు పరిస్థితిని గ్రహించి జ్వలిత ప్రమాదాన్ని గుర్తించి ఈ డిక్లరేషన్‌ను వెలువరించాల్సి వచ్చిందని తెలిపారు. దీనిపై వేర్వేరు ఆలోచనలు పనికిరావని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News