వాషింగ్టన్: అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కాబూల్‌లో విమానాశ్రయ కార్యకలాపాలను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా జై శంకర్ నొక్కి చెప్పారు. భద్రతా మండలి అధ్యక్ష హోదా కింద భారత్ ఈ వారంలో జరగనున్న రెండు ముఖ్యమైన కార్యక్రమాలకు అధ్యక్షత వహించడం కోసం జైశంకర్ సోమవారం న్యూయార్క్‌కు వచ్చారు. కాగా అఫ్ఘాన్‌లో పరిస్థితి గురించి ఆయన అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ వాషింగ్టన్‌లో చెప్పారు. ఆ వెంటనే జైశంకర్ కూడా అఫ్ఘాన్ పరిస్థితిపై తాను బ్లింకెన్‌తో మాట్లాడానని, అత్యవసరంగా కాబూల్ విమానాశ్రయం కార్యకలాపాలను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పినట్లు ఒక ట్వీట్‌లో తెలిపారు. కాబూల్‌నుంచి భారత దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకు రావడం గురించి కూడా జైశంకర్ అమెరికా అధికారులతో ఎడతెరిపిలేకుండా చర్చించినట్లు తెలుస్తోంది.
అఫ్ఘాన్‌లో పరిస్థితిపై బ్లింకెన్‌తో జైశంకర్ చర్చలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -