Friday, December 20, 2024

ఖతార్‌లో ఉరిశిక్ష పడిన మాజీ నేవీ అధికారుల కుటుంబాలకు మంత్రి జైశంకర్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గూఢచర్యం కేసులో మరణదండన పడిన 8 మంది భారత మాజీ నేవీ అధికారుల కుటుంబాలను సోమవారం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పరామర్శించారు. వారి విడుదల కోసం భారత్ అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తోందని భరోసా ఇచ్చారు. 8 మంది మాజీ నేవీ అధికారులకు ఖతార్ కోర్టు గురువారం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు తీవ్ర ఆందోళన కలిగించిందని, విడుదలకు చట్టపరమైన అవకాశాలను ఉపయోగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయా కుటుంబాలతో ప్రభుత్వం సన్నిహితంగా సమన్వయం చేసుకుంటానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News