మన తెలంగాణ / హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి 201920 సంవత్సరానికి గాను జాతీయ యువజన అవార్డుకు వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన జక్కిశ్రీకాంత్ ఎంపికయ్యారు. ఇటీవల కర్నాటక రాష్ట్రంలోని ధార్వాడ్‌లో 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరిగిన జాతీయ యువజన వారోత్సవాల్లో జక్కి శ్రీకాంత్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ తావల్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ , కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నారు.
కోవిడ్ సమయంలో విద్యార్థులకు విలేజ్ లెర్నింగ్ కేంద్రం పెట్టడం, గ్రాంథాలయాన్ని ఏర్పాటు చేయడం, విద్యార్థినిలకు ఆత్మ రక్షణ శిక్షణా కార్యక్రమం నిర్వహించినందుకు తనకు అవార్డు రావడం సంతోషంగా ఉందని జక్కి శ్రీకాంత్ తెలిపారు. జక్కి శ్రీకాంత్‌ను రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యసాచి ఘోష్ ఘనంగా సత్కరించి అభినందించారు.