Monday, December 23, 2024

జక్లేర్..కృష్ణా రూట్‌లో….

- Advertisement -
- Advertisement -

జక్లేర్..కృష్ణా రూట్‌లో….
తనిఖీలు నిర్వహించిన దమ రైల్వే జిఎం

మన తెలంగాణ / హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర జక్లేర్ కృష్ణా రూట్‌లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఈ మేరకు ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, జక్లేర్ , కృష్ణా సెక్షన్‌ను హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ , ఇతర సీనియర్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జైన్ దేవరకద్ర క్రిష్ణా సెక్షన్‌లో రియర్ విండో తనిఖీ ద్వారా ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థ భద్రత అంశాలను పరిశీలించారు.

మరికల్, జక్లేర్ రైల్వే స్టేషన్‌లను ఆయన నిశితంగా తనిఖీ చేశారు. ఆయా స్టేషన్ల ఆవరణ మొత్తాన్ని పరిశీలించారు. ఈ తనిఖీ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కలిశారు. కాగా ఈ సందర్భంగా స్టేషన్ మాస్టర్ కార్యాలయంలోని రికార్డులను , అలాగే మరికల్ స్టేషన్‌లోని పాయింట్ నం.102ను కూడా ఆయన పరిశీలించారు. అనంతరం జక్లేర్ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన క్రమంలో స్టేషన్‌లో రైల్వే ప్రయాణికులకు అందుబాటులోఉన్న సౌకర్యాలను సమీక్షించారు. అనంతరం జనరల్ మేనేజర్ మాగనూరు రైల్వేస్టేషన్‌ను కూడా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. దేవరకద్ర రైల్వేస్టేషన్‌లో సౌకర్యాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలపై అధికారులతో జిఎం అరుణ్ కుమార్ జైన్ చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News