వర్ని: మండల కేంద్రంలోని వర్ని జలాల్‌పూర్ వరకు వేసిన బిటి రోడ్డు పది కాలాలపాటు పదిలంగా ఉండవలసిన రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్షం కారణంగా మూన్నాళ్ల ముచ్చటగానే తయా రైందనే విమర్శలు వస్తున్నాయి. రోడ్డు పనుల్లో నిర్లక్షంవల్ల బిటి రోడ్డు గుంతలమయమైందని దీంతో వాహనాల రాకపోకలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఈ రోడ్డు పుణ్యక్షేత్రమైన బడా పహాడ్ రోడ్డు గుండా మహారాష్ట్ర, కర్నాటక , ఆంధ్రప్రదేశ్‌ప్రాంతాల నుంచి భక్తులు వాహనాలు రాక పోకలు సాగిస్తుంటారని రోడ్డు గుంతలమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఈ గుంతలమూలంగా పలుమార్లు వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయని పలు వురు పేర్కొంటున్నారు. ఈ రోడ్డుపై వెళ్లాలంటే ప్రాణాలరచేతిలో పెట్టుకుని ప్రయాణించలసి వస్తోందని వాపోతున్నారు. ఈ రోడ్డు వేసిన ఏడాదిన్నర కూడా గడవలేదని అపుడే రోడ్డు గుంతలు పడితే ఎట్లా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబందిత ఆర్‌అండ్‌బి అధికారులు స్పందించి ఈ రోడ్డుపై గుంతలను సరిచేసి నిర్లక్షంగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.