Thursday, December 19, 2024

జల్ జీవన్ మిషన్ కు నిధులు ఇవ్వండి: పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి వ్యక్తికి 55 లీటర్లు ఇస్తామని ఆయన అన్నారు. మోదీ కలను సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామని, నీటి సరఫరాకు వచ్చే ఇబ్బందులకు పరిష్కారం అయ్యేలా చూస్తామని ఆయన తెలియజేశారు. అమృత ధార వచ్చే లోపాలు, ఇబ్బందులు సరిచేస్తామని చెప్పారు. విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాన్, ఎంఎల్ సి హరిప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ ప్రసంగించారు.  జల్ జీవన్ మిషన్ సమీక్షలో చాలా లోపాలున్నాయని తెలుసుకున్నామని, జల్ జీవన్ అమలు చేయడం కోసం అనేక రాష్ర్టాలు రూ. లక్ష కోట్లు అడిగాయని పవన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేవలం రూ. 26 కోట్లే అడిగిందని, జల్ జీవన్ అమలుకు గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదన్నారు.  జల్ జీవన్ గ్రాంట్ ఇవ్వలేక పోవడం వల్ల సరిగా అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు.  గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అధికారులు వివరించారని, గత ప్రభుత్వం నిధులను సద్వినియోగం చేయలేదని, కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిందని విమర్శలు గుప్పించారు. కేంద్రం ఎపికి రూ. 76 కోట్లు ఇవ్వాలని పవన్ కోరారు.  త్వరలో డిపిఆర్ పూర్తి చేసి కేంద్రానికి అందిస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News