Monday, January 20, 2025

జలశక్తి మంత్రిత్వశాఖ ట్విటర్ ఖాతా హ్యాక్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఢిల్లీ ఎయిమ్స్ ట్విటర్ ఖాతా హ్యాక్ అయి , పది రోజులు గడవక ముందే మరో ప్రభుత్వ ఖాతా హ్యాకర్ల ఆధీనం లోకి వెళ్లడం ఆందోళనకరంగా మారింది. గురువారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకున్నట్టు భావిస్తున్నారు. ఈ పేజీలో అనుమానాస్పద ట్వీట్లు కనిపించాయి. ఈ ట్విటర్ ఖాతాలో క్రిప్టో రంగం లోని సుయ్ వాలేట్ అనే సంస్థకు సంబంధించిన పోస్టులు కనిపించాయి.

జలశక్తి ట్విటర్ ఖాతాప్రొఫైల్ ఫొటోగా ఉన్న త్రివర్ణ పతాకాన్ని మార్చేసి సుయ్ వాలెట్ లోగోను పెట్టారు. ఇక కవర్ ఇమేజీ కూడా సుయ్ బొమ్మతో ఉంచారు. అంతేకాదు.. ఈ ఖాతాలో చేసిన ట్వీట్లను గుర్తు తెలియని పలు ఖాతాలకు ట్యాగ్ చేశారు. వెంటనే అధికారులు రంగం లోకి దిగి ఈ ఖాతాను తిరిగి తమ ఆధీనం లోకి తెచ్చుకున్నారు. సదరు క్రిప్టో సంస్థ ట్వీట్లను తొలగించారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు రంగం లోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

నవంబర్ 23న ఢిల్లీ ఎయిమ్స్ కంప్యూటర్ సర్వర్లపై రాన్సమ్‌వేర్ దాడి జరిగింది. అప్పట్లో సదరు హ్యాకర్ రూ. 200 కోట్లను క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండు చేశాడు. కానీ అతడికి ఎటువంటి సొమ్ము చెల్లించలేదు. ఢిల్లీ పోలీసులు సైబర్ టెర్రరిజం కింద కేసు నమోదు చేశారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందంతో కలిసి దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ హ్యాకింగ్‌తో కనీసం 3 కోట్ల మంది పేషెంట్ల డేటా హ్యాక్ అయినట్టు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News