Sunday, December 22, 2024

జలంధర్ డిఎస్‌పి మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

జలంధర్: అర్జున అవార్డు గ్రహీత, జలంధర్ డిఎస్‌పి దల్బీర్ సింగ్ మృతదేహం ఇక్కడకు సమీపంలోని బస్తీ బావా ఖేల్ వద్ద లభించింది. ఆదివారం తన మిత్రుడొకరు వాహనంలో బస్టాండ్ వద్ద దించివేసిన తర్వాత వాహనం ఢీకొని దల్బీర్ సింగ్ మరణించారని పోలీసు కమిషనర్ స్వపన్ శర్మ సోమారం తెలిపారు. అక్కడకు కొద్ది దూరంలోని బస్తీ బావా ఖేల్ వద్ద సింగ్ మృతదేహం లభించడం సంచలనం సృష్టించింది. పరిసరాలలోని సిసిటివి ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. డిఎస్‌పి సింగ్ చివరిసారి చూసిన కొదరు వ్యక్తునలు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ 17న జలంధర్‌లోని మండ్ ప్రాంతంలోగల బస్తీ ఇబ్రహిం ఖాన్ గ్రామంలో స్థానికులతో ఘర్షణ సందర్భంగా డిఎస్‌పి సింగ్ తుపాకీతో వారిని బెదిరించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News