Friday, January 24, 2025

కూతురుపై గ్యాంగ్ రేప్… పోలీసులు బెదిరించడంతో తండ్రి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: అమ్మాయిపై గ్యాంగ్ రేస్ చేసి అనంతరం తండ్రిని బెదిరించడంతో పాటు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు అలసత్వం వహించడంతో కన్న తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జలౌన్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. జలౌన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారు. బాధితురాలు కన్నతండ్రి పంజాబ్‌లో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

Also Read: రైల్వే విధుల్లోకి రెజ్లర్లు

తండ్రి ఈ విషయం చెప్పడంతో కూతురుతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులు కూడా తండ్రి కూతుళ్లను బెదిరించడంతో కేసు నమోదు చేయడంలో అలసత్వం వహించాడు. ఘటనా జరిగి రెండు నెలలు కావొస్తున్న కేసులో పురోగతి లేకపోవడంతో బాధితురాలు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బంధువులు, గ్రామస్థులు నేరస్ధుడి ఇంటి ముందు ధర్నాకు దిగడంతో జలౌన్ ఎఎస్‌పి అసీమ్ చౌదరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోలీస్ అధికారి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News