Sunday, December 22, 2024

జలవాగు బిటి రోడ్డు పనుల ప్రారంభం

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీను నెరవేర్చుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ పథకాలు నియోజకవర్గంలోని ప్రజలకు అందే విధంగా పరిపాలన చేస్తూ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముందుకు సాగుతున్నారు. గ్రామాల అభివృద్ది ధ్యేయంగా జలవాగు రోడ్డు ఏర్పాటు కొరకు రూ. 63 లక్షలు పంచాయితీ రాజ్ శాఖ ద్వారా నిధులు మంజూరు చేయించి, బీటీ రోడ్డు పనులను బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జలవాగు గ్రామస్థులు ఎన్నిలక వేళ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చటంతో ఎమ్మెల్యే మెచ్చాను ఘనంగా పూలదండలతో సన్మానించి, స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జట్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, ఎంపిపి సోయం ప్రసాద్, వైస్ ఎంపిపి దారా మల్లిఖార్జునరావు, సర్పంచ్ కొర్సా సాయి రూప, ఆళ్ళ జంగం, దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్, కొర్సా వెంకటేశ్వరరావు, అబ్దుల్ జిన్నా, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News