Monday, December 23, 2024

వంద మంది మహిళలపై బాబా అఘాయిత్యం… 14 ఏళ్ల జైలు శిక్ష… ఫోన్‌లో 120 అశ్లీల వీడియోలు

- Advertisement -
- Advertisement -

ఛండీఘడ్: వంద మందిపైగా మహిళలపై అత్యాచారం చేసిన జాలేబీ బాబాను 14 ఏళ్ల జైలు శిక్ష పడిన సంఘటన హర్యానా రాష్ట్రం ఫతేబాద్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫతేబాద్‌లో అమర్‌వీర్ అనే వ్యక్తి తనకు తానుగా బాబాగా చలామణి అవుతున్నాడు. అతడు జాలేబీ బాబాగా పేరు మార్చుకొని తన దగ్గరకు వచ్చే భక్తులకు డ్రగ్స్ ఇచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. అనంతరం వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి వారి నుంచి డబ్బులు, బంగారు అభరణాలు లాక్కునేవాడు. మైనర్ బాలికపై అఘాయిత్యం చేసినట్టు ఫిర్యాదు అందడంతో అతడిపై పోలీసులు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా బాబా ఫోన్‌లో 120 అశ్లీల వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. 2018 అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా కోర్టు అతడికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News