Sunday, January 19, 2025

ముగ్గురు పిల్లలను బావిలోకి తోసేసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

ముంబయి: ముగ్గురు పిల్లలను తండ్రి బావిలో తోసేసి చంపి అనంతరం పోలీసులకు ఫోన్ చేసిన సంఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దిమోగాం గ్రామంలో సంతోష్ ధొండిరామ్ తక్‌వాలే అనే వ్యక్తి నివసిస్తున్నాడు. సంతోష్ కు శివాణి(08), దిపాలి(07), సోహామ్(05) అనే పిల్లలు ఉన్నారు. మొదటి భార్య చనిపోవడంతో అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఛత్రపతి శాంభాజీ నగర్‌లో కచ్నెర్ గ్రామంలో ఓ హోటల్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం దిమోగాం గ్రామానికి చెరుకొని ముగ్గురు పిల్లలను బావి వద్దకు తీసుకెళ్లాడు. ముగ్గురిని బావిలోకి తోసేసి అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకొని మూడు మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News