Wednesday, January 22, 2025

జాల్నా- ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : అయోధ్య నుండి రిమోట్ వీడియో లింక్ ద్వారా జాల్నా – ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అదే సమయంలో జాల్నా రైల్వే స్టేషన్‌లో కూడా ఓ కార్యక్రమం జరగగా ఇందులోనూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి రావుసాహెబ్ దాదారావు పాటిల్ దాన్వే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లు పాల్గొన్నారు. వీరితోపాటు ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సభను ఉద్దేశించి రావుసాహెబ్ పాటిల్ దన్వే మాట్లాడుతూ ప్రధాని జాల్నా నుండి ముంబైకి మొదటి వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించినందున డిసెంబర్ 30వ తేదీ జాల్నా చరిత్రలో ఒక విశిష్టమైన రోజుగా నిలిచిపోతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతం నుండి మొదటి వందేభారత్ రైలు ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. 2014 నుండి కూడా ఈ ప్రాంతం మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు గణనీయమైన పురోగతిని సాధించాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్రకు 12,000 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించామని, ఇది 2014 తో పోల్చితే భారీగా పెరిగిందన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రసంగిస్తూ జాల్నా నుంచి ముంబయికి వందేభారత్ రైలు సేవలు ప్రారంభించినందుకు ఈరోజు ఒక ముఖ్యమైన సందర్భమని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా రైలు అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో రూ. 1.06 లక్షల కోట్లు వ్యయంతో రైల్వే మౌలిక సదుపాయాల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. వందేభారత్ రైలు ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి యూరోపియన్ దేశాలలోని అధునాతన రైళ్లతో సమానంగా ఉందని పేర్కొన్నారు. జాల్నా- ముంబై ( ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్) వందే భారత్ ఎక్స్ ప్రెస్ మరాఠ్వాడా ప్రాంతంలోని జాల్నా ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్) వంటి ముఖ్యమైన నగరాలను రాష్ట్ర రాజధాని అయిన ముంబైతో మాత్రమే కాకుండా మన్మాడ్ , నాసిక్, కళ్యాణ్ , థానే మరియు దాదర్ వంటి రాష్ట్రంలోని ఇతర ముఖ్యమైన నగరాలతో కూడా అనుసంధానం చేస్తున్నదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News