Wednesday, January 22, 2025

పుతిన్… మోడీ మాట విను

- Advertisement -
- Advertisement -

James Cleverly said that Putin should listen to Modi

బ్రిటన్ విదేశాంగ మంత్రి పిలుపు

న్యూయార్క్ : ప్రపంచవేదికపై భారత ప్రధాని మోడీ ప్రభావశీల వ్యక్తిగానే నిలుస్తారని, శాంతిస్థాపన విషయంలో రష్యా అధ్యక్షులు పుతిన్ మోడీ మాట వినాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ తెలిపారు. ప్రపంచస్థాయిలో భారతదేశ స్థితిని రష్యా అధినాయకత్వం గౌరవిస్తుందని తాము భావిస్తున్నామని చెప్పారు. ఇది యుద్ధ కాలం కాదని ఇటీవలషాంఘై భేటీలో పుతిన్‌కు మోడీ నచ్చచెప్పిన అంశాన్ని ఈ దశలో బ్రిటన్ మంత్రి ప్రస్తావించారు. ప్రధాని మోడీ అందరిని ప్రభావితం చేయగలిగే దశలో ఉన్నారని, ఆయన మాటను పుతిన్ తప్పనిసరిగా వినితీరుతారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విరమణ దిశలో భారత ప్రధాని జోక్యం అత్యవసరం అని తెలిపారు. ఐరాస సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చిన దశలో ఆయన ఓ ఛానల్‌కు ఇంటర్వూ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News