Monday, March 31, 2025

జమిలి ఎన్నికల బిల్లులు వచ్చే వారమే

- Advertisement -
- Advertisement -

బిల్లులు వాయిదాకు ప్రభుత్వ అనూహ్య నిర్ణయం
ప్రస్తుత సమావేశాలకు మరి నాలుగు రోజులే వ్యవధి
లోక్‌సభలో ముందుగా ఆర్థిక లావాదేవీల పరిశీలన
అనుబంధ పద్దులపై నేడు సభలో చర్చ

న్యూఢిల్లీ : ‘ఒక దేశం ఒకే ఎన్నిక’కు సంబంధించిన బిల్లుల ప్రతిపాదనను ప్రభుత్వం వాయిదా వేసిందని, ముందుగా ఆర్థికపరమైన కార్యకలాపాలను సభ పూర్తి చేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. జమిలి ఎన్నికల బిల్లులు రాజ్యాంగ (12వ సవరణ) బిల్లును, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ)బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రదేశపెట్టనున్న జాబితాలో చేర్చారు. సోమవారానికి నిర్ణయించిన అనుబంధ పద్దుల మొదటి బ్యాచ్‌ను సభ ఆమోదించిన తరువాత ఈ వారం చివర్లో సభ ముందుకు తీసుకురావచ్చునని ప్రభుత్వ వర్గాలు సూచించాయి.

లోక్‌సభ సచివాలయం జారీ చేసిన సవరించిన జాబితాలో సోమవారానికి సంబంధించిన అజెండాలో ఆ రెండు బిల్లులు లేవు. అయితే, లోక్‌సభ స్పీకర్ అనుమతితో ‘అనుబంధ కార్యకలాపాల జాబితా’ ద్వారా చివరి నిమిషంలో పార్లమెంట్‌కు శాసన సంబంధిత అజెండాలో ప్రభుత్వం ఎప్పుడైనా తీసుకురావచ్చు. లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రెండు బిల్లులను సభా కార్యకలాపాల నిబంధనల ప్రకారం క్రితం వారం సభ్యులకు పంపిణీ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 20న ముగియవలసి ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News