Wednesday, March 12, 2025

జమిలిపై సూచనలకు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

వెబ్‌సైట్ ప్రారంభించనున్న పార్లమెంటరీ కమిటీ
న్యూఢిల్లీ : ‘ఒక దేశం ఒకే ఎన్నిక’ బిల్లులను పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీ ఈ అంశంపై దేశవ్యాప్తంగా సూచనలను ఆహ్వానించేందుకుఒక వెబ్‌సైట్‌ను త్వరలో ప్రారంభించనున్నది. కమిటీ పూర్తి పారదర్శకతతో పని చేస్తున్నదని, జమిలి ఎన్నికల అంశంపై తమ అభిప్రాయాలు పంచుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ దక్కేలా చూడాలని ఆశిస్తున్నదని రాజ్యాంగ (129 సవరణ) బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2024పై సంయుక్త కమిటీ చైర్మన్, బిజెపి నేత పిపి చౌదరి తెలియజేశారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగోయ్, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్ అభిప్రాయాలను కూడా కమిటీ విన్నది. వెబ్‌సైట్ గురించి కమిటీ సభ్యులకు వివరించినట్లు, జమిలి ఎన్నికలై దేశవ్యాప్తంగా వినతిపత్రాలను ఆహ్వానిస్తూ ఒక వాణిజ్య ప్రకటనను కూడా కమిటీ జారీ చేయనున్నట్లు చౌదరి తెలిపారు. 1952 నుంచి 1967 వరకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించారని, 1967లో ఆ వలయానికి అంతరాయం వాటిల్లిందని ఆయన తెలిపారు. జమిలి ఎన్నికల పునరుద్ధరణ కోసం 1980 దశకం నుంచి వివిధ వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని చౌదరి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News