Monday, November 18, 2024

జమిలితోనే జాతి భవిష్యత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ భవిష్యత్తు కోసమే వన్ నేషన్, వన్ ఎలక్షన్ అ ని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబా ద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం లో బిజెపి తెలుగు వెర్షన్ సంకల్ప పత్రా న్ని (మేనిఫెస్టో) బిజెపి ఎంపి లక్ష్మణ్‌తో కలిసి కిషన్‌రెడ్డి ఆదివారం విడుదల చేశా రు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడు తూ,  ప్రధాని మోడీ పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందిందన్నా రు. రానున్న రోజుల్లో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని మోడీ గ్యారంటీలో ప్రస్తావించారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశంలో అనేక సమస్యలను మోడీ పరిష్కరించారని, అందుకే ప్రధాని మోడీ నాయకత్వం దేశానికి, దేశ భవిష్యత్‌కు అవసరమన్నారు. మోడీ లేని భారతావనిని ఊహించుకోలేమని వెల్లడించారు. కేంద్రంలో మరోసారి బిజెపి సర్కార్ అధికారంలోకి వస్తుందని, మోడీ మూడోసారి భారత ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ‘మూడు దశాబ్దాల తరవాత ప్రధాని మోదీ నేతృత్వంలో స్థిరమైన, సమర్థవంతమైన ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పాటైంది. పోలీసుల మీద రాళ్లు రువ్వలేనటువంటి భారతావనిని మోడీ గ్యారంటీ పేరుతో నిర్మాణం చేస్తున్నాం. మనం ఐదవ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా ఇండియాను నిర్మించడంలో ప్రధాని విజయం సాధించారని మనవి చేస్తున్నాన’ని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

నాణ్యమైన విద్య, అందరికీ అందుబాటులో వైద్యం, తినడానికి తిండి మోడీ గ్యారంటీ అని వెల్లడిం చారు. నాణ్యమైన విద్య, అందరికీ ఆరోగ్యం, పేదలకు పక్కా ఇళ్లు గ్యారంటీతో పాటు మరో ఐదేళ్ల వరకు ఉచిత బియ్యం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్‌తో పేదలకు రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. బిఆర్‌ఎస్ దుర్మార్గపు పాలన కారణంగా ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు కాలేదని వెల్లడించారు. ఎఐఐఎంఎస్, కొత్త వైద్య కళాశాల ఏర్పాటు, ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్ ద్వారా పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నామన్నారు. పేపర్ లీకేజీ అరికట్టే విషయంలో కఠిన చట్టాలు తీసుకొచ్చామని, పోస్టాఫీసులను మినీ బ్యాంక్‌లుగా మార్చేస్తున్నామని, భారత్‌ను సర్వీస్ సెక్టార్ హబ్ గా విస్తరిస్తామని అన్నారు. మత్స్యకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, వచ్చే ఐదేళ్లలో దేశంలోని పేద, మద్య తరగతి వర్గాల వారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో 3 కోట్ల ఇళ్లను మోడీ ప్రభుత్వం నిర్మించి ఇస్తుందన్నారు.

‘ఇది ప్రజల మానిఫెస్టో’ అన్న కిషన్ రెడ్డి మోడీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలు చేసేస్తారని చెప్పారు. 2047 వికసిత భారత్ పేరుతో బిజెపి ముందుకెళ్తోందన్నారు. అవినీతి, బంధుప్రీతిని కాంగ్రెస్ పూర్తిగా వదిలిపెట్టలేదని విమర్శించారు. కాగా మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్ తో బిజెపి రూపొం దించిన జాతీయ మేనిఫెస్టోను ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారా మన్ తదితరులు కలిసి విడుదల చేయగా తాజాగా ఆదివారం తెలంగాణలో తెలుగు మేనిఫెస్టోను రాష్ట్ర నేతలు విడుదల చేశారు. కాగా బిజెపి ప్రకటించిన మేనిఫెస్టోలో 14 అంశాలను చేర్చారు. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం, మరో ఐదేళ్లు ఉచిత రేషన్, పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్, ముద్ర రుణాల పరిమితి రూ. 20 లక్షల వరకు పెంపు, ఎప్పటికప్పుడు పంటల మద్దతు ధర పెంపు వంటి ముఖ్యమైన హామీలు ఉన్నాయి.

కాంగ్రెస్ న్యాయపత్రాన్ని ప్రజలు అన్యాయపత్రంగా భావిస్తున్నారు : రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపణ
కాంగ్రెస్ న్యాయ పత్రాన్ని ప్రజలు అన్యాయ పత్రంగా భావిస్తున్నారని బిజెపి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి వికసిత భారత్ కోసం కాషాయ పార్టీ పాల్పడుతుంటే, కాంగ్రెస్ విభజిత భారత్ కోసం నినదిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.12లక్షల కోట్లు దోచుకున్న కాంగ్రెస్ పేరు ఇండియాగా మార్చుకున్నంత మాత్రాన వారు మారరు అని స్పష్టం చేశారు. న్యాయ పత్రంలో బ్రిటిష్ ఆనవాళ్లు కొనసాగిస్తూ విభజించు – పాలించు లాగా ఉంది అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ న్యాయ పత్రం ముస్లింలీగ్ మాదిరిగానే మేనిఫెస్టో ఉందన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ న్యాయ పత్రానికి భిన్నంగా బీజేపీ సంకల్ప పత్రం ఉందన్నారు. మైనార్టీజం పేరుతో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ప్రజల మనోగతంను గాయపరుస్తుందని మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో మోసం చేస్తుందన్నారు. ఉచితాలు – గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. సంకల్ప పత్రాన్ని బీజేపీ పవిత్ర పత్రంగా భావిస్తోంది అని లక్ష్మణ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News