Tuesday, January 21, 2025

మళ్లీ తెరపైకి జమిలి ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం ఇప్పటి హయాంలోనే అనుకున్నట్లుగా ఒకే దేశం ఒకే ఎన్నికలు విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈ విషయం ఈ ప్రక్రియకు సం బంధిత వర్గాలతో స్పష్టం కాగా ఇందుకు సంబంధించి విధివిధానాలను సర్కారు రూపొందించుంటున్నట్లు వెల్లడైంది. “ప్రస్తుత హయాంలోనే ఈ ఎన్నికల వినూత్న ప్ర క్రియ ఖచ్చితంగా అమలు అవుతుంది. ఇంతవరకూ ఆ లోచనల్లో ఉన్న అంశం వాస్తవికతను సంతరించుకుంటు ంది” అని సంబంధిత వర్గా లు తమ తమ పేర్లు వెల్లడికారాదనే షరతుతో తెలిపాయి. ఎన్నికలను జమిలి తరహా లో నిర్వహించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే మోడీ పలుసార్లు వేదికలపై తెలిపారు. పైగా సాధ్యాసాధ్యాల ప రిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యం లో ఉన్నత స్థాయి కమిటీ కూడా ఏర్పాటు అయింది.

పై గా ఈ కమిటీ ఇప్పటికే దేశంలో ఏకకాల ఎన్నికలు ఉత్తమమమనే విషయాన్ని నివేదిక ద్వారా కేంద్రానికి అం దించింది. ఈ విధంగా తాను అనుకున్న సంవిధానానికి అనుమతి రావడంతో మోడీ దీనిని త్వరలోనే కార్యాచరణకు తీసుకువచ్చే వీలుంది. ఎన్‌డిఎ 3 అధికారంలోకి వ చ్చి 100 రోజులు గడిచాయి. ఇప్పుడున్న కీలక మిత్రపక్షాల మద్దతు కొనసాగుతుందని, ఈ క్రమంలో ప్రభుత్వానికి ఢోకాలేదని బిజెపి వర్గాలు విశ్వాసంతో ఉన్నా యి. ఇక జమిలి ఎన్నికలకు పార్టీలకు అతీతంగా మద్ద తు కూడా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటికైతే ప్రతిపక్షాల నుంచి ప్రత్యేకించి ఇండియా కూటమి నుంచి ఈ ఒకే ఎన్నికల ప్రక్రియ నిర్వహణ విషయంలో స్పష్టమైన అభిప్రాయం వెలువడలేదు.

ఇక లా కమిషన్‌దే కీలక పాత్ర
మోడీ సంకల్పిత జమిలికి దాదాపుగా అధికారిక ముద్ర పడినట్లే. ఇక దీనికి సంబంధించిన న్యాయ చట్టపరమైన సాంకేతిక విషయాలు ప్రస్తావనకు వస్తాయి. దేశంలోని మూడంచెల ప్రభుత్వ వ్యవస్థకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు , స్థానిక సంస్థలు ప్రాతిపదిక అవుతాయి. స్థానిక సంస్థలలో మున్సిపాల్టీలు, పంచాయితీలు అనుసంధానంగా ఉంటున్నాయి. వీటిని పరిశీలించి ఇప్పుడున్న చట్టాలను సరైన విధంగా సవరించి దేశంలో ఏకకాల ఎన్నికలకు అనుమతి కల్పించేందుకు చట్టం చట్రంలోకి ఈ విషయాన్ని తీసుకువచ్చేందుకు లా కమిషన్ చర్యలు తీసుకోనుంది. దేశంలో జమిలి నిర్వహణకు ఇదే కీలకం అవుతుంది. ఇక దేశంలో ఎన్నికల తరువాత హంగ్ అసెంబ్లీలు ఏర్పడితే , అవిశ్వాస తీర్మానాలు తలెత్తితే , నెగ్గితే యూనిటీ ప్రభుత్వం ఏర్పాటుకు కూడా నిబంధనలను తీసుకురానున్నారు. దేశంలో జమిలీ నిర్వహణకు కోవింద్ కమిటీ ఎటువంటి కాలపరిమితి విధించలేదు.

రాజ్యాంగ సవరణలు అత్యవసరం
అయితే ఇటువంటి ఎన్నికల నిర్వహణకు ఓ అమలు బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. ఇక ప్యానెల్ సూచించిన దాని ప్రకారం జమిలి నిర్వహణ జరగాలంటే ఏకంగా 18 రాజ్యాంగ సవరణలు జరగాల్సి ఉంటుంది. రాష్ట్రాల అసెంబ్లీల ఆమోద ముద్ర అవసరం లేని రీతిలో ఉండేవే ఈ సవరణలలో ఎక్కువగా ఉన్నాయి. దీనితో లా కమిషన్ సంబంధిత ఎన్నికల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు వీలేర్పడుతుంది. ఇక ఈ ఎన్నికల ప్రక్రియకు రాజ్యాంగ సవరణ బిల్లు అత్యంత పరీక్షా ఘట్టం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ఆమోదానికి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తే ఇక జమిలి నిర్వహణ మరింత వేగవంతం అవుతుందని లా కమిషన్ వర్గాలు ధృవీకరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News