పాండవులు అరణ్యవాసం సమయంలో జమ్మిచెట్టుపై ఆయుధాలు పెట్టారని పురాణాలు చెబుతుంటాయి. ఆ చెట్టు నుంచి ఆయుధాలు తీసి యుద్ధానికి వెళ్తే విజయం కలిగిందని ప్రతీతి. అందుకే తెలంగాణలో దసరా రోజున జమ్మిచెట్టుకు పూజలు చేసి సోరకాయ ను కోస్తారు. వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో వందేళ్ల నాటి జమ్మిచెట్టు ఉంది. దసరా పండగ రోజు సాయం త్రం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ల్యాబర్తి గ్రామ ప్రజలు డప్పు చప్పుళ్లతో ఈ జమ్మిచెట్టు దగ్గరకు చేరుకుంటారు.పెద్ద గంపలో సొర కాయ, సజ్జ, మొక్కజొన్నలను పట్టుకొని దసరా బండ దగ్గరకు వస్తారు. జమ్మిచెట్టు దసరా బండ వద్ద కొత్తగా నిర్మించిన పాకలో సొరకాయ కు పూజలు చేస్తారు. అనంతరం జంతు బలికి బందులుగా సొరకాయను కోస్తారు. ఈ చారిత్రక జమ్మిచెట్టు వద్దకు వెళ్లి కంకణాలు కట్టుకొని పూజలు నిర్వహిస్తారు. దసరా పండగ రోజున శమీ పూజ చేస్తారు. తర్వాతే జమ్మి ఆకులను పంచుకుంటారు.
దీని వెనక పురాణ కథలు ఉన్నా యి. శమీ పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి పెడుతారు. వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి చెట్టును చాలా పవిత్రమైనదిగా భావి స్తారు. జమ్మి చెట్టును పూజిం చడం వెనక అనేక కారణాలు ఉన్నాయి. జమ్మిని పూజిస్తే జీవితంలో విజయాలు వస్తాయని అందరూ నమ్ము తారు. జమ్మి చెట్టు చాలా కాలం బతుకుతుంది. ఈ చెట్టు వేళ్లు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టును నాటు వైద్యంలోనూ ఉపయోగిస్తారు. ఈ చెట్టు గాలి ఆరో గ్యానికి మంచి దని అంటారు. అందుకే శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని అంటుంటారు. మరోవైపు, శ్రీ రాముడు కూడా రావణునిపై యుద్ధం చేసి విజయదశమినాడు విజయం సాధించిన శమీ వృక్షాన్ని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే దసరా పండుగ రోజు సాయంత్రం జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుం దని, శని దోషాలు పోతాయని భక్తుల నమ్మకంగా ఉంది.. జమ్మి చెట్టు వద్ద పూజ చేసిన తర్వాత జమ్మి ఆకులను తీసుకొని ఇంటికి వెళ్తారు. స్నేహితులు, తెలిసినవారికి జమ్మిఆకు చేతిలోపెట్టి అలాయ్ బలాయ్ చెప్పుకుంటారు.. ఇక, ఇంట్లోని వారి చేతుల్లో జమ్మి ఆకులను బంగారం అని చెప్పి అందిస్తుంటారు. పెద్దల చేతిలో జమ్మి ఆకులను ఉంచి.. వారి ఆశీస్సులు తీసుకుంటారు. అయి తే, జమ్మి చెట్టును బంగారంగా చెప్ప టానికి అనేక కారణాలు ఉన్నాయి. శమీ వృక్షంగా దీనిని అంతా పిలుస్తారు. ఎందుకంటే జమ్మిచెట్టును సం స్కృతంలో శమీ, శివా, మాంగల్య, లక్ష్మీ, శుభదా, పవిత్ర, సురభి అనే పేర్లతో పిలుస్తారు. జమ్మిచెట్టు ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగిఉంది. జమ్మి ఆకులు, బెరడు, విత్తనాలు, పువ్వులు, అతిసార, గర్భకోశ, కురుపులు, పుండ్లు వంటి వ్యాధుల నివారణకు ఉపకరిస్తాయని కూడా చెబుతా రు. అంతేకాదు దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో శమీవృక్షమూ ఉందని చెప్తారు.
త్రేతాయుగాన వనవాస సమయం లో శ్రీరాము డు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.. విజయదశమి నాడు ప్రజలచే పూజలందుకుంటున్న మహిమా న్వితిమైన వృక్షంగా జమ్మిచెట్టును చెప్పవచ్చు. జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టును నాటమని ప్రోత్సహిస్తోంది అంటే ఆ చెట్టుకు ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు.