Monday, December 23, 2024

దసరా రోజున జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేస్తారు?

- Advertisement -
- Advertisement -

పాండవులు అరణ్యవాసం సమయంలో జమ్మిచెట్టుపై ఆయుధాలు పెట్టారని పురాణాలు చెబుతుంటాయి. ఆ చెట్టు నుంచి ఆయుధాలు తీసి యుద్ధానికి వెళ్తే విజయం కలిగిందని ప్రతీతి. మనం జమ్మి చెట్టు అని పిలిచే శమీవృక్షం ప్రస్థావన రామాయణ, మహాభారతాల్లో మనకు కనిపిస్తుంది. రావణుని సంహరించే ముందు శ్రీరామచంద్రుడు, కౌరవులపై విజయాన్నిసాధించేముందు పాండవులు శమీ వృక్షానికి పూజలు చేశారు. వారికి విజయాలను అందించిన శమీవృక్షాన్ని పూజిస్తే మనకు కూడా భవిష్యత్తులో విజయాలు లభిస్తామన్ననమ్మకంతో విజయ దశమి నాడు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు.

త్రేతాయుగంలో శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. ద్వాపరయుగంలో పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ధ కొలువుకు వెళ్లారు. అజ్ఞాతవాసం ముగిసాక సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి శమీ వృక్షానికి సమస్కరించుకుని, ఆ ఆయుధాలు ధరించి అర్జుణుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించడంతో జమ్మీ చెట్టుకు పూజ చేస్తారు.

దసరా రోజున చారిత్రక జమ్మిచెట్టు వద్దకు వెళ్లి కంకణాలు కట్టుకొని పూజలు నిర్వహిస్తారు. సానుకూల శుభ ఫలితాల కోసం నిత్యం జమ్మి చెట్టుకు నీరు పోసి సంరక్షించాలి. క్రమం తప్పకుండా జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ, పసుపు కుంకుమలతో పూజించాలి. సాయం సంధ్యా సమయంలో జమ్మి చెట్టు వద్ద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన జాతకంలో ఏలినాటి శని ప్రభావం ఉన్నా, అర్ధాష్టమ శని, అష్టమ శని వలన కలిగే దుష్ప్రభావాలు పోతాయని విశ్వాసం. దసరా పండగ రోజున శమీ పూజ చేస్తారు. తర్వాతే జమ్మి ఆకులను ప్రజలు పంచుకుంటారు. దీని వెనక పురాణ కథలు ఉన్నా యి. శమీ పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి పెడుతారు. వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి చెట్టును చాలా పవిత్రమైనదిగా భావి స్తారు. జమ్మి చెట్టును పూజిం చడం వెనక అనేక కారణాలు ఉన్నాయి. జమ్మిని పూజిస్తే జీవితంలో విజయాలు వస్తాయని అందరూ నమ్ము తారు. జమ్మి చెట్టు చాలా కాలం బతుకుతుంది. ఈ చెట్టు వేళ్లు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టును నాటు వైద్యంలోనూ ఉపయోగిస్తారు. ఈ చెట్టు గాలి ఆరో గ్యానికి మంచి దని అంటారు. అందుకే శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని అంటుంటారు. మరోవైపు, శ్రీ రాముడు కూడా రావణునిపై యుద్ధం చేసి విజయదశమినాడు విజయం సాధించిన శమీ వృక్షాన్ని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే దసరా పండుగ రోజు సాయంత్రం జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.

ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుం దని, శని దోషాలు పోతాయని భక్తుల నమ్మకంగా ఉంది.. జమ్మి చెట్టు వద్ద పూజ చేసిన తర్వాత జమ్మి ఆకులను తీసుకొని ఇంటికి వెళ్తారు. స్నేహితులు, తెలిసినవారికి జమ్మిఆకు చేతిలోపెట్టి అలాయ్ బలాయ్ చెప్పుకుంటారు.. ఇక, ఇంట్లోని వారి చేతుల్లో జమ్మి ఆకులను బంగారం అని చెప్పి అందిస్తుంటారు. పెద్దల చేతిలో జమ్మి ఆకులను ఉంచి.. వారి ఆశీస్సులు తీసుకుంటారు. అయి తే, జమ్మి చెట్టును బంగారంగా చెప్ప టానికి అనేక కారణాలు ఉన్నాయి. శమీ వృక్షంగా దీనిని అంతా పిలుస్తారు. ఎందుకంటే జమ్మిచెట్టును సం స్కృతంలో శమీ, శివా, మాంగల్య, లక్ష్మీ, శుభదా, పవిత్ర, సురభి అనే పేర్లతో పిలుస్తారు. జమ్మిచెట్టు ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగిఉంది. జమ్మి ఆకులు, బెరడు, విత్తనాలు, పువ్వులు, అతిసార, గర్భకోశ, కురుపులు, పుండ్లు వంటి వ్యాధుల నివారణకు ఉపకరిస్తాయని కూడా చెబుతా రు. అంతేకాదు దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో శమీవృక్షమూ ఉందని చెప్తారు.

త్రేతాయుగాన వనవాస సమయం లో శ్రీరాము డు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.. విజయదశమి నాడు ప్రజలచే పూజలందుకుంటున్న మహిమా న్వితిమైన వృక్షంగా జమ్మిచెట్టును చెప్పవచ్చు. జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టును నాటమని ప్రోత్సహిస్తోంది అంటే ఆ చెట్టుకు ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News