Saturday, November 23, 2024

1100 దేవాలయాలలో 1100 వందల జమ్మి చెట్లు నాటుతాం: ఉప్పల శ్రీనివాస్ గుప్త

- Advertisement -
- Advertisement -

Jammi tree planted in Temples

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు దేవాలయాల్లో  జమ్మి చెట్టు మొక్కలు నాటామని తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు.  ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయం (సెవెన్ టెంపుల్) ఆలయంలో 6 జమ్మి చెట్లు, హైదరాబాద్ లోని మోతి నగర్, శ్రీ హనుమాన్ దేవాలయంలో (శ్రీ రాజ రాజేశ్వరి దేవాలయం లో) 2 రెండు జమ్మి చెట్లు నాటామని ఉప్పల శ్రీనివాస్ గుప్త పేర్కొన్నారు.  గురువారం ఉదయం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయం (సెవెన్ టెంపుల్) ఆలయంలో 6 ఆరు జమ్మి చెట్లు, హైదరాబాద్ లోని మోతి నగర్, శ్రీ హనుమాన్ దేవాలయం లో (శ్రీ రాజ రాజేశ్వరి దేవాలయం లో)రెండు 2 జమ్మి చెట్లు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడారు.  పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశ్యంతో ప్రజలకు, బావి తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలని సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలు నాటుతున్నామన్నారు. తెలంగాణ ను ఆకుపచ్చ తెలంగాణ గా మారుస్తూ  కలియుగ అశోక చక్రవర్తి లాగా కెసిఆర్ పని చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత 24% ఉన్న గ్రీనరీని 33% శాతానికి పెంచడం జరిగిందని తెలియజేశారు. తెలంగాణ టూరిజం రంగాన్ని కూడా తెలంగాణ హబ్ లాగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చెట్లు పెంచేందుకు కృషి చేస్తున్నారని, కీసర గుట్టను దత్తత తీసుకుని వేలాది మొక్కలు నాటుతున్నారని కొనియాడారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 1100 దేవాలయాలలో 1100 వందల జమ్మి చెట్లు పెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సనత్ నగర్, శ్రీ హనుమాన్ దేవాలయం (సెవెన్ టెంపుల్) ఇఒ శ్రీనివాస రాజు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి శ్రీనివాస్ గుప్త, ఐవిఎఫ్ సనత్ నగర్ డివిజన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గుప్త, ట్రెసరర్ శివకుమార్, శ్రీ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ సింగారపు శ్రీనివాస్ గుప్త, శేఖర్ గుప్త, కటకం భాస్కర్, బద్రీనాద్, వెంకటేష్, శివ శంకర్, పెరుమళ్ళ నాగమణి, భారతి, ఐవిఎఫ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ గౌరి శంకర్, ఐవిఎఫ్ హైదరాబాద్ సభ్యులు రాజేష్ కుమార్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆర్ కె వీరేశం, ఇల్లూరి లక్ష్మినారాయణ, పక్యాల వెంకటేష్, వెంకన్న, బంజారాహిల్స్, సనత్ నగర్ ఉప్పల యాదగిరి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News