న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తర్వాత జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి) రాజీవ్ కుమార్ వెల్లడించారు. భద్రతా కోణంలో చూస్తే అక్కడ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. శనివారం ఆయన 2024 సార్వత్రిక, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏప్రికల 19 నుంచి ప్రారంభమై ఏడు దశలలో లెక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువతాయి.
లోక్‌సభ ఎన్నికలతోపాటు జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికలను ఎందుకు నిర్వహించడం లేదని విలేకరులు ప్రశ్నించగా అక్కడ ప్రతి అభ్యర్థికి భద్రతను సమకూర్చవలసి ఉంటుందని, దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో అది సాధ్యం కాదని సిఇసి తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2023 డిసెంబర్‌లో జమ్మూ కశ్మీరు పునర్వస్థీకరణ చట్ట సవరణ జరిగిందని, అప్పటి నుంచే ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ అంశాన్ని పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. 2019లో జమ్మూ కశ్మీరు పునర్వవస్థీకరణ చట్టం ఆమోదం పొందింది. 107 అసెంబ్లీ స్థానాల ఏర్పాటుకు అవకాశం ఉంద.ఇ అందులో 24 పాక్ ఆక్రమిత కశ్మీరులో ఉన్నాయి. పునర్విభజన కమిషన్ అక్కడకు వచ్చినపుడు సీట్ల సంఖ్యలో మార్పులు జరిగాయి. పునర్వవస్థీకరణ చట్టానికి, పునర్వభజనకు పొంతన కుదరడం లేదు. అది 2023 డిసెంబర్‌లో జరిగింది.
2023 డిసెంబర్ నుంచి మా పని మొదలైంది అని సిఇసి అన్నారు. పార్లమెంటరీ ఎన్నికలతోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని జమ్మూ కశ్మీరులోని అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయని, అయితే ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పాలనా యంత్రాంగం తెలిపిందని ఆయన వివరించారు. ప్రతి నియోజవకర్గంలో 10-12 మంది అభ్యర్థులు ఉంటారని, మొత్తంగా చూస్తే 1000 మందికిపైగా అభ్యర్థులు ఉంటారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క అభ్యర్థికి భద్రతను కల్పించాల్సి ఉంటుందని, ఈ సమయంలో అది సాధ్యం కాదని సిఇసి తెలిపారు. అయితే ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత సాధ్యమైనంత త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.