Thursday, December 19, 2024

కుల్గంలో భారీ ఎన్‌కౌంటర్: ఐదుగురు తీవ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో కుల్గం జిల్లాలోని బెహీబాగ్ ప్రాంతంలో గురువారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కద్దర్ ప్రాంతంలో తీవ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం తెలియడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా బలగాల రాకను గమనించిన తీవ్రవాదులు తొలుత కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థల నుంచి మందుగుండు సామాగ్రి, ఎకె47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News