- Advertisement -
న్యూఢిల్లీ: జమ్మూ, కశ్మీర్ అసెంబ్లీలో కశ్మీరీ వలసదారులనుంచి ఇద్దరు సభ్యులను,అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్‌నుంచి నిర్వాసితులైన వారినుంచి ఒకరిని నామినేట్ చేయడానికి అనుమతించే జమ్మూ కశ్మీర్ పునర్వంస్థీకరణ ( సవరణ) చట్టం 2023 మంగళవారంనుంచి అమలులోకి వచ్చింది. అలాగే బలహీన అట్టడుగు వర్గాల’ పదాన్ని ఒబిసిగా సవరించడానికి ఉద్దేశించిన జమ్మూ, కశ్మీర్ రిజరేషన్( సవరణ) చట్టం 2023 కూడా అమలులోకి వచ్చింది మంగళవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన రెండు వేర్వేరు నోటిషికేషన్ల ప్రకారం ఈ రెండు చట్టాలు జమ్మూ , కశ్మీర్‌లో అమలులోకి వచ్చిన తేదీని డిసెంబర్ 26గా నిర్ణయించారు. ఈ రెండు చట్టాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే.
- Advertisement -