- Advertisement -
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రం జామ్ నగర్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. భారత్ వాయుసేనకు చెందిన జగ్వార్ విమానం కుప్పకూలడంతో పైలట్ మృతి చెందగా మరో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. గాయపడిన పైలట్‌ను జిజి ఆస్పత్రికి తరలించారు. సువర్థ గ్రామ శివారులో విమానం కుప్పకూలిన వెంటనే మంటలు చెలరేగాయి. విమానం రెండు ముక్కలుగా విరిగిపోయిందిన స్థానిక మీడియా వెల్లడించింది. ఈ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.
- Advertisement -