ముంబయి: జంతువులను ప్రేమించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తెలిపారు. జామ్‌నగర్ రిఫైనరీ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి అనంత్ అంబానీ ప్రసంగించారు. మా తాత ధీరుభాయ్ అంబానీ జామ్‌నగర్‌కు పునాదులు వేశారని, నా తల్లిదండ్రులు విజయానికి కృషి చేశారని, తాను మాత్రం జామ్‌నగర్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. జంతువులను ప్రేమించాలని తన తల్లి చిన్నప్పటి నుంచి చెప్పేవారని గుర్తు చేశారు. జామ్‌నగర్‌లో వంతారా ప్రాజెక్టులో భాగంగా మూడు వేల ఎకరాలలో జంతువుల సంరక్షణ కేంద్రాన్ని అనంత్ అంబానీ ఏర్పాటు చేశారు. వన్య ప్రాణుల సంరక్షణ కోసం మూడు వేల మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. వంతారాలో ఏనుగుల కోసం ప్రత్యేక ఆస్పత్రిని కూడా నిర్మించారు. ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న 200 మంది నిపుణులతో వన్య ప్రాణులను సంరక్షిస్తున్నారు.
జామ్ నగర్ ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తా: అనంత్ అంబానీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -