Monday, December 23, 2024

ఈటల సతీమణి కబ్జా భూములు రైతులకు ఇప్పిస్తా

- Advertisement -
- Advertisement -

Jamuna Hatcheries ’land victims protest

బాధితులకు నర్సాపూర్ ఎంఎల్‌ఎ మదన్ రెడ్డి హామీ

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: తమ భూ ములను అన్యాయంగా ఆక్రమించుకున్నారం టూ ఈటల రాజేందర్ సతీమణి జమునకు చెందిన ‘జమునా హేచరీస్’ భూ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. శుక్రవారం మెదక్ జిల్లా హకీంపేట్, అచ్చంపేట ప్రాంతాలకు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశా రు. అన్యాయంగా తమ భూములను హేచరీస్ యాజమాన్యం ఆక్రమించారని వారు ఏకరువు పెట్టారు. గతంలో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అధికారులు వచ్చి సర్వేలు చేసి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారన్నారు. ఆందోళన అనంతరం నర్సాపూర్ ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో ఎంఎల్‌ఎ మదన్ రెడ్డి ని కలిసి తమ సమస్యను వివరించారు. ఇంతవరకూ తమకు న్యాయం జరగలేదంటూ రైతులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ బాధితులతో మాట్లాడుతూ కబ్జా భూ ములను తిరిగి ఇప్పించేందుకు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అదేవిధంగా మీ భూములను మీ పేరుతో సొంత పట్టాలు చేయిస్తానని చెప్పడంతో వారు వెనుదిరిగారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News