Thursday, January 23, 2025

‘జనగణ మన’ షురూ

- Advertisement -
- Advertisement -

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండతో యాక్షన్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించబోతున్న చిత్రం ‘జెజిఎం’ (జనగణ మన). ఈ సినిమాను ముంబయ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గ్రాండ్‌గా ప్రారంభించారు. హెలికాప్టర్ ఛాపర్‌లో ప్రత్యేకంగా దిగిన విజయ్ దేవరకొండ వాకింగ్ స్టయిల్, ఆర్మీ గెటప్‌తో పాత్రపరంగా చాలా ఫర్ఫెక్ట్‌గా ఉన్నాడు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాతలు ఛార్మికౌర్, వంశీ పైడిపల్లి, శ్రీకర స్టూడియోస్ డైరెక్టర్ సింగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడుదలచేసిన పోస్టర్‌లో ఇండియా మ్యాప్‌తో పాటు కొందరు సైనికులు కనిపించారు. యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.

విజయ్ లుక్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఛార్మీ కౌర్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ “విజయ్‌తో మళ్లీ కలిసి పనిచేయడం చాలా గొప్పగా అనిపిస్తోంది. ‘జనగణ మన’ ఒక బలమైన కథనం. ఇది అల్టిమేట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌”అని అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “ ఈ స్క్రిప్ట్ చాలా అద్భుతంగా, ఛాలెంజింగ్‌గా ఉంది. కథ ప్రత్యేకమైనది. ప్రతి భారతీయుడి హృదయాన్ని టచ్ చేస్తుంది”అని తెలిపారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించనున్న ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది ఆగస్టు 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News