Monday, December 23, 2024

సేవ చేయలేకపోయామనే బాధ ఎక్కువగా ఉంది: జానా రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: గుట్టలు, చెట్లు ఉన్న ఈ ప్రాంతాన్ని పార్టీ కార్యక్రమాలకు అనువుగా మార్చడం సంతోషకరమైన విషయమని కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా జానా రెడ్డి మాట్లాడారు. సోనియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.  పిసిసి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ స్థలాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మాకు అధికారం రాలేదన్న బాధ కంటే సోనియా ఇచ్చిన తెలంగాణకు సేవ చేయలేకపోయామనే బాధ ఎక్కువగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News